కాగజినగర్లోని ఎక్సైజ్ ఆఫీస్ ముందు మహిళలు తమ నిరసన తెలిపారు. మద్యం అమ్మకాల వల్ల తమ కుటుంబాలు నాశనమవుతున్నాయని, పురుషులు మద్యం సేవించి తమ సంపాదన ఇంటికి డబ్బులు తీసుకురాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని డిమాండ్ చేశారు.