తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద కోళ్ల షెడ్‌పై చిరుత దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.