తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దీంతో భక్తులను తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తూ, భద్రతా చర్యలను కూడా ముమ్మరం చేశారు.