శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో చిరుతల సంచారం గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి సమీపంలోని కొండ ప్రాంతంలో చిరుతలు ఆవాసం ఏర్పరుచుకున్నాయి. రాత్రివేళల్లో గ్రామంలోకి వచ్చి పశువులను చంపుతున్నాయి. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. గ్రామస్తులు ప్రభుత్వం నుండి రక్షణ కోరుతున్నారు.