ఇన్ స్టా గ్రామ్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. న్యూ ఇన్స్టంట్, ప్రొఫైల్ గ్రిడ్ రీఆర్డర్ లాంటి వాటి తర్వాత, ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు కామెంట్ బాక్స్ లో టెక్స్ట్, జీఐఎఫ్ లతో పాటు తమ గ్యాలరీలోని ఫోటోలను కూడా సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఇది యూజర్ల పరస్పర చర్యలను మరింత మెరుగుపరుస్తుంది.