మోకిల పోలీసులు అరెస్ట్ చేసిన మహిళా ఆఘోరి అలియాస్ శ్రీనివాస్‌కు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కోర్టు షాక్ ఇచ్చింది. అఘోరీకి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. ఒక మహిళను మోసం చేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత నెల అరెస్ట్ అయిన ఆమెను వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.