కర్నూలు జిల్లా నేరుడుప్పకాడులో ఉల్లి రైతుకు గిట్టుబాటు ధర దక్కలేదు. క్వింటాలుకు కేవలం 200 రూపాయలు పలకడంతో, సాగు ఖర్చులు కూడా రాక, రెండు లక్షల రూపాయల నష్టంతో తన ఉల్లి పంట మొత్తాన్ని ట్రాక్టర్‌తో దున్నేశాడు. ఈ పరిస్థితి అనేక మంది రైతులను కలచివేస్తోంది.