ప్రజాస్వామ్యం ఇంకా చచ్చిపోలేదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మందబలం, అధికార మదంతో తమ ఎమ్మెల్సీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందని, ఇప్పటికే అరెస్టయిన తమ ఎమ్మెల్సీలకు మళ్లీ శిక్ష వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.