మంత్రుల ఫోన్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ చేశారు.