ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తెలంగాణ యాసను సినిమాల్లో అద్భుతంగా వాడి ప్రేక్షకులను మెప్పించారు. కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన, హైదరాబాద్కు వచ్చిన తర్వాత తెలంగాణ యాసపై మక్కువ పెంచుకున్నారు. 1985లో ప్రతిఘటన సినిమాలో మంత్రి కాశయ్య పాత్ర ద్వారా ఆయన తెలంగాణ యాసలో మాట్లాడటం ప్రారంభించారు. ఈ పాత్ర ఆయనకు గొప్ప స్టార్డమ్ను తెచ్చిపెట్టింది.