మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చే వరకు ఎదురుచూస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఈ హామీ ఇచ్చారని, ఆలస్యమైనా సరే తాను ఎదురుచూస్తానని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.