పవన్ కళ్యాణ్ ఓజి సినిమాపై మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో తమిళ హీరో శింబుతో ఓ పాట పాడించారు తమన్. తాజాగా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసారు శింబు. ఆయనతో అదిరిపోయే సాంగ్ పాడించామని చెప్పారు తమన్. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఓజి మేకర్స్.