కోకాపేటలోని నియోపోలిస్ గోల్డెన్ మైల్ భూముల వేలం కొత్త రికార్డు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15, 16లలో ఎకరం ధర ఏకంగా రూ.151.25 కోట్లు పలికింది. జీహెచ్ఆర్ సంస్థ ప్లాట్ నంబర్ 15ను దక్కించుకుంది. గత వారం ధరలను అధిగమిస్తూ, ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది.