స్నేక్ క్యాచర్ ఒక ప్రమాదకరమైన నాగుపామును పట్టుకోవడానికి ప్రయత్నించగా, ఆ పాము అతని మెడను చుట్టుకుంది. పాము విషం కలిగి ఉన్నప్పటికీ, అతనికి ఎలాంటి హాని జరగలేదు. పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. కర్ణాటకలోని దావణగిరిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.