అమెరికాలోని హవాయి ద్వీపంలో కిలూ వేయ అగ్నిపర్వతం బద్దలైంది. లావా పెద్ద ఎత్తున ఉబికి వచ్చి వంద అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతోంది. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల తాత్కాలికంగా ఏర్పడిన పెద్ద గొయ్యిలో లావా నిలిచిపోయింది. గత ఏడాది డిసెంబర్ నుంచి కిలూ వేయ అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది. ఈ క్రియాశీలతను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.