ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో హృదయవిదారక ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారిని ముద్దాడుతుండగా 22 ఏళ్ల భూక్య సుష్మ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూశారు. కళ్ల ముందే తల్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆ చిన్నారి రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. యువతి మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.