ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ వైరా మండలం నారపునేనిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారు. 50 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలకు ఒకే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నాడు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పాఠశాలకు ఐదు లక్షల రూపాయలతో కంచె, మరుగుదొడ్లు నిర్మించారు. పాఠశాల భవనం రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు.