ఖమ్మం జిల్లాలోని మనుగూరు నుండి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు తీవ్రంగా గొడవపడ్డారు. మాటామాటా పెరిగి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. డ్రైవర్ బస్సును అశ్వపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆపి, పోలీసుల సహాయంతో ఇద్దరు మహిళలను వేరు వేరు బస్సుల్లో పంపించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు.