కేరళలోని పొత్తన్కోడ్కు చెందిన ఒక మహిళ రేష్మా చంద్రశేఖర్ ఏడుగురితో వివాహం చేసుకుని బంగారం దోచుకున్న ఆరోపణలపై అరెస్ట్ అయింది. ఎనిమిదో వివాహానికి సిద్ధమవుతుండగా ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి కాబోయే వరుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె గుట్టు బయటపడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.