కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. కెసిఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.