ఎమ్మెల్సీ కవిత తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు. పార్టీ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తన లేఖ లీక్ అయిన విషయంపై వివరణ కోరారు. కేసీఆర్ కు నోటీసులు వచ్చినప్పుడు నిరసనలు లేకపోవడం, ఇతర నేతలకు వచ్చినప్పుడు హంగామా చేయడంపై ఆమె ప్రశ్నించారు. "నా జోలికి వస్తే బాగుండదు" అని కవిత హెచ్చరించారు.