కర్ణాటక విజయపుర జిల్లాలోని ఉల్లి రైతులు తమ పంటకు తక్కువ ధరలు లభించడంతో ఆవేదన చెందుతున్నారు. కిలోకు రెండు రూపాయల ధర వల్ల పెట్టుబడి కూడా రావడం లేదని, రోడ్డుపై పంటను పారబోసి ఓ రైతు నిరసన తెలిపారు. ఇటు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉల్లి రైతుల పరిస్థితి కూడా ఇదే. తక్కువ ధరల వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.