కరీంనగర్ జిల్లా రామడుగు పోలీసులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం జరిగిన అన్న హత్య కేసును ఛేదించారు. అప్పులు తీర్చడానికి నాలుగు కోట్ల పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న తమ్ముడు, అన్నను టిప్పర్‌తో హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. బీమా ప్రతినిధుల అనుమానంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.