ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరంలోని ఓ ప్రాంతంలో రోడ్డు గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు గుంతల్లో పడి చిన్నారి గాయపడటంతో తండ్రి తీవ్ర ఆగ్రహం చెందాడు. రోడ్డుపై బురదనీటిలో పడుకుని తనదైన శైలిలో వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. అధ్వాన్నంగా మారిన రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.