పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి ఇంకో పార్టీకి వెళ్లాలనుకుంటే.. పదవికి రాజీనామా చేసి వెళ్లాలని చెప్పారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని సవాల్ చేశారు.