కాకినాడ జిల్లా, సునీ మండలం, ఎర్రకోనేరుతో పాటు కాకినాడ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్లో నీళ్లు కలుస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 12 లీటర్ల పెట్రోల్లో దాదాపు 10 లీటర్ల నీళ్లు వస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వాహనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని, బంకు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి.