కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర వైద్య నిర్లక్ష్యం వెలుగుచూసింది. కాలు ఆపరేషన్ చేసిన అనంతరం వైద్యులు లోపల బ్లేడు మర్చిపోయి కుట్లు వేశారు. స్కానింగ్‌లో ఈ విషయం బయటపడటంతో బాధితుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వైద్యులు మొదట రోగిపై ఎదురుతిరిగినా, చివరికి మరో ఆపరేషన్ చేసి బ్లేడును తొలగించారు.