కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తొమ్మిదవ తేదీన జ్యోతుల వీర శివప్రసాద్ ఫెన్సింగ్ వేయగా, కండవల్లి చక్రమ్మ వర్గం దాడి చేసింది. మహిళలపై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇరు వర్గాలు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.