సినీ నటి కాజల్ అగర్వాల్ మరణించినట్లు ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలను కాజల్ ఖండించారు. తాను సురక్షితంగా ఉన్నారని, ఈ తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయకూడదని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.