వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్వప్న బార్ అండ్ రెస్టారెంట్లో ప్రేమ వ్యవహారం కారణంగా లోకేష్ అనే యువకుడిపై పది మంది దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లు, బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో లోకేష్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే నిందితులు పారిపోగా, గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.