Jubilee Hills By-Election: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 48.24 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఫలితాల కోసం తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. యూసుఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.