కడప జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన జరిగింది. అభిమానులు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, క్షమాపణలు కోరారు.