పెళ్లి వేడుకలలో చెప్పులు దాచిపెట్టడం సాంప్రదాయం ఉద్రిక్తతకు దారితీసింది. వధూవరుల కుటుంబాలు కలబడి పొట్టుపొట్టుగా కొట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బిజినోర్ లో జరిగింది ఈ ఘటన. దాచిపెట్టిన చెప్పులు ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్ చేయగా పెళ్లి కొడుకు రూ.5000 మాత్రమే ఇవ్వటంతో గొడవ ప్రారంభమైంది.