నేరేడు పండ్లు సీజనల్ పండ్లు. ఇవి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు తగ్గడంలో సహాయపడటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణులు రోజుకు 200 గ్రాముల వరకు నేరేడు పండ్లు తినమని సూచిస్తున్నారు.