జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హసిన్ ముసా అనే ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్చులను విడుదల చేస్తూ, వారి ఆచూకి చెప్పిన వారికి రూ. 20 లక్షలు బహుమతి ప్రకటించారు. అలీ భాయ్ మరియు హసిన్ ముసా పాకిస్థాన్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.