వేసవిలో వెల్లుల్లి తినడం గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నప్పటికీ, వేసవిలో అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది కాబట్టి, నోటి పూతలు, అజీర్ణం, మలబద్ధకం ఉన్నవారు దీనిని తినకూడదు. వైద్య సలహా తీసుకున్న తర్వాతే వేసవిలో వెల్లుల్లిని తినాలి.