మామిడి పండును పెరుగుతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు, చర్మ అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి వేడిని, పెరుగు చల్లదనాన్ని కలిగిస్తుంది. ఈ రెండింటి కలయిక శరీరంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మామిడి తిన్న తర్వాత కొంత సమయం గడిచిన తర్వాతే పెరుగు తినడం మంచిది. కూల్ డ్రింక్స్ తో కూడా మామిడి తినకూడదు.