ఉదయం పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని డైటీషియన్లు చెబుతున్నారు. త్వరగా జీర్ణమయ్యే పండ్లు శరీరానికి పోషకాలను అందిస్తాయి. ఆపిల్, బొప్పాయి వంటి పండ్లు ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు. అయితే, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలున్నవారు జాగ్రత్త వహించాలి.