ఖమ్మం జిల్లాకు చెందిన గూడెల్లి నారాయణ రావు తన కుమారుడి వివాహానికి ఐఫోన్ మాదిరిగా డిజైన్ చేయించిన పెళ్లి పత్రికను పంచిపెట్టారు. ఈ వినూత్న ఆలోచనతో పెళ్లి పత్రికను చూసిన వారు ముందుగా అర్థం చేసుకోలేకపోయారు. పెళ్లి పత్రికను సెల్ ఫోన్ లా డిజైన్ చేయడం ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా ఉందని వారు పేర్కొన్నారు.