లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన కుమారుడి వివాహ వేడుకలో వినూత్నంగా ఆలోచించారు. విందులో ఏమి వండబోతున్నారో ఇన్విటేషన్ కార్డులో ముద్రించారు. అతిథులు ఆహారాన్ని సంతృప్తిగా ఆస్వాదించేలా చూసుకున్నారు. ఈ వినూత్న ఆలోచన అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్ళిళ్ళలో సాంప్రదాయకంగా వండే వంటకాలను కూడా ప్రస్తావించారు. లక్ష్మీనారాయణ గారి విందు భోజనం ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగింది.