మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి తన హెల్మెట్‌కు సీసీటీవీ కెమెరాను అమర్చుకున్నాడు. పొరుగువారితో జరిగిన వివాదం కారణంగా తనపై దాడి జరుగుతుందనే భయంతో ఇలా సీసీటీవీ పెట్టుకున్నట్లు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజు తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.