ఇండిగో విమానంలో ప్రయాణికుడిపై వేడి నాన్ వెజ్ కూర పడిన ఘటనలో వినియోగదారుల ఫోరం కీలక తీర్పు వెలువరించింది. బాధితుడు ఫిర్యాదు చేయగా, ఫోరం విచారణ జరిపి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ. 25,000 జరిమానా విధించింది. మార్చి 2024లో బ్యాంకాక్ నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.