రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మట్లాడారు. ఆయనను భారత్‌కు రావాలని ఆహ్వానించారు. ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. మోదీ తన ట్వీట్లో పుతిన్‌ను "నా ప్రియ మిత్రుడు" అని పేర్కొన్నారు. పుతిన్ ఏడాది చివర్లో భారత్‌కు రానున్నట్లు తెలిపారు. చైనా కూడా మోదీని ఎస్సీసీఓ సదస్సుకు ఆహ్వానించింది.