గుజరాత్లోని దమడచా గ్రామంలో అంబికా నది వరదల్లో రెండు రోజులుగా చిక్కుకున్న చిన్నారిని భారత సైన్యం విజయవంతంగా రక్షించింది. వరద నీటిలో చిక్కుకుపోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పటికీ, అత్యాధునిక పరికరాలతో సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.