ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ మహిళా జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్కు చేరుకున్న భారత్, తొలిసారి ప్రపంచ కప్ గెలవాలని ఆశిస్తోంది. టీమిండియా ఫైనల్స్ గెలిస్తే ఐసీసీతో పాటు బీసీసీఐ నుంచి మొత్తం రూ.165 కోట్ల ప్రైజ్ మనీ లభించే అవకాశం ఉంది.