బంగారం, వెండి, ప్లాటినం వినియోగదారులకు కేంద్రం షాకిచ్చింది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గోల్డ్ పై సుంకం 6 శాతం నుంచి 15 శాతానికి పెరిగింది. బంగారం కొనుగోళ్లను కట్టడి చేసి, విదేశీ మారక ద్రవ్య నిల్వల క్షీణతను అడ్డుకోవడమే ఈ నిర్ణయం లక్ష్యం. కొత్త సుంకాలు తక్షణం అమల్లోకి వచ్చాయి.