ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కర్ణాటకలోని మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. నాలుగు కోట్ల రూపాయల విలువైన వజ్రాలతో అలంకరించిన వెండి కిరీటాన్ని అమ్మవారికి బహూకరించారు. వీరభద్రస్వామికి వెండి కత్తిని కూడా సమర్పించారు. ఇళయరాజా తన జీవిత విజయానికి మూకాంబిక అమ్మవారి ఆశీస్సులే కారణమని తెలిపారు.