శ్రీశైలం బ్రహ్మంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో పెద్దపులి కనిపించడంతో భక్తులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బ్రహ్మరి పుష్పవనం వద్ద పెద్దపులి సంచారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి కొరత కారణంగా జంతువులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.