ఐబొమ్మ రవికి పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంలో ఉద్యోగం ఆఫర్ చేయగా, అతను తిరస్కరించాడు. కరేబియన్లో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలన్నదే అతని లక్ష్యం. పోలీసులు అతని బ్యాంకు ఖాతా నుండి ₹3 కోట్లు సీజ్ చేయగా, హైదరాబాద్, విశాఖపట్నంలోని భూములను కూడా లాక్ చేశారు. తాను పైరసీని విడిచిపెట్టి కొత్త జీవితం ప్రారంభిస్తానని రవి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.