సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో పోలీస్ విచారణ పూర్తైంది. ఐబొమ్మ వెబ్సైట్లోని ఐ అంటే ఇంటర్నెట్ అని, వైజాగ్ పరిభాషలో సినిమాను బొమ్మ అంటారని రవి వెల్లడించాడు. ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు సినిమాలు చూపించాలనే లక్ష్యంతో ఐబొమ్మ అని పేరు పెట్టినట్లు చెప్పాడు. విచారణలో రవి పశ్చాత్తాపపడి, పైరసీని మానేస్తానని తెలిపినట్లు తెలుస్తోంది.